calender_icon.png 3 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసెలు వేసుకున్నవారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

21-03-2025 01:53:29 AM

చేవెళ్ల,  మార్చి 20(విజయ క్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 75 లో రెండేళ్ల కింద గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. గురువారం పార్టీ  నియోజకవర్గ ఇంచార్జి కే రామస్వామి ఆధ్వర్యంలో పేదలు, నేతలతో  కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..  పేదలు తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  వారికి వెంటనే పట్టాలు ఇచ్చి కరెంట్, తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని,  అర్హులందరికీ ఇండ్ల స్థలాలు , రేషన్ కార్డులు, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  అనంతరం ఆర్డీవో కార్యాలయ డీటీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ప్రభు లింగం, మండలాల కార్యదర్శులు  ఎం సత్తిరెడ్డి , సుధీర్ ,  శ్రీనివాస్ , నక్క జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు జూకంటి అంజయ్య,  మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్, ఎన్‌ఎఫ్ ఐయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, గీత పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.