calender_icon.png 24 February, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ లను మార్చి 31 లోపు చెల్లించాలి

18-02-2025 03:33:43 PM

మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్

మంథని,(విజయక్రాంతి): ఇంటి పన్ను(House Tax), ట్రేడ్ లైసెన్స్(Trade License)లను మార్చి 31 లోపు చెల్లించాలని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్(Manthani Municipal Commissioner Manohar) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఇంటి పన్నును మరియు ట్రేడ్ లైసెన్స్ లను సకాలములో  మార్చి 31 లోపు చెల్లించాలని, లేని యెడల అపరాధ రుసుము విధించబడునని కమీషనర్ తెలిపారు. 

అలాగే మంథని పట్టణ వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ లు తీసుకో గలరని,  తీసుకున్న వారు మార్చి 20  నుండి మార్చి 31 వరకు పునరుద్దించుకోవాలని, లేని యెడల మెదటి మూడు నెలలు ఏప్రిల్ 01 నుండి జూన్ 30 వరకు) 25% అపరాధ రుసుము విధించబడునని, జూలై 01 నుండి ప్రతి సంవత్సరం 50% శాతం అపరాధ రుసుము విధించబడునని, కావున మంథని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నులను సకాలములో చెల్లించి మంథని మున్సిపల్ అభివృద్ధికి సహకరించగలరని కమీషనర్ తెలిపారు.