calender_icon.png 4 April, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు సీజ్.....

26-03-2025 12:36:35 AM

కొరడా జులిపిస్తున్న పెబ్బేరు మున్సిపాలిటీ

పెబ్బేరు మార్చి 25 :మున్సిపాలిటీ పరిధిలోని ఒక యజమాని ఇంటిని మంగళ వారం ఉదయం మున్సి పాలిటీ కమీషనర్ అశోక్ రెడ్డి సీజ్ చేసారు. జూరాల ప్రియద ర్శిని కాంపు కార్యాలయంల యానికి ఎదురుగా ఉన్న ఒక యజమాని ఇంటిని మూ డులక్షల నలభై వేల రూపాయ లు బకాయిలు చెల్లించలేదని మున్సిపాలిటీ మేనేజర్ గణేష్ బాబు తెలిపారు.

పలు మార్లు యజమానికి గుర్తుచేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సెల్లార్ తో పాటు అదనపు నిర్మాణం చేయటం వల్ల అపరాధ రుసుము పడిందని చెప్పారు. రెడ్ నోటీసు జారీ చేయటంతో పాటు కమీషనర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటిని సీజ్ చేసారు. ఇంటి యజమాని పిల్లర్ నుంచి పిల్లర్ దాకా కొలతలు తీసుకోలేదని ఖాళీ ప్రదేశానికి కూడా అదనంగా రుసుము వేయటం వల్లే అంత మొత్తం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుఆఫీసర్స్ ప్రశాంత్, మిథున్, బిల్ కలెక్టర్ కృష్ణయ్య, బ్రహ్మం, బురాన్, రాముడు తదితరులు పాల్గొన్నారు.