calender_icon.png 19 November, 2024 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు రెట్టింపు

21-07-2024 03:00:00 AM

నాలుగేండ్లలో 94 శాతం పెరిగిన ధరలు.. ప్రాప్ ఈక్విటీ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): దేశంలో ప్రధాన నగరాలతోపాటు టైర్- 2 నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. దేశంలోని టాప్- 30 టైర్ -2 నగరాల్లో ఇళ్ల ధరలు గత నాలుగేండ్లలో రెట్టింపు అయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, మైసూర్, నాసిక్, సూరత్, ఆగ్రా, భువనేశ్వర్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో 2019 నుంచి 2023- మధ్యకాలంలో ఇళ్ల ధరలు 94 శాతం మేర పెరిగినట్టు రియల్ ఎస్టేట్ డాటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఆయా నగరాల్లో ఇళ్లకు బలమైన డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నగరాల్లోని వీటిల్లో టాప్ ధరల పెరుగుదల 54- శాతం మధ్య ఉన్నట్టు వివరించింది.

డిమాండ్ పెరగడంతోనే..

డిమాండ్ అధికం కావడంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ప్రాప్ ఈక్విటీ ఫౌండర్ సీఈవో సమీర్ జనూజా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కొత్త లాంచింగుల కంటే కొనుగోళ్లే అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆర్థికాభివృద్ధి, అనుసంధానత పెరగడం, మౌలిక వసతుల అభివృద్ధి. సానుకూల ఉద్యోగ మార్కెట్ వంటి అంశాలు వినియోగదారుల్లో విశ్వాసాన్ని అధికం చేశాయని, ఈ క్రమంలోనే టైర్  నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.

ఈ నగరాల్లో భారీ వృద్ధి

ఆగ్రాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 94 శాతం పెరిగి 2024 మార్చి నాటికి చదరపు అడుగు 7,163గా ఉన్నట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. ఆ తర్వాత గోవాలో 90 శాతం, లుధియానాలో 10 శాతం, ఇండోర్‌లో 72 శాతం, ఛండీగడ్‌లో 70 శాతం, డెహ్రడూన్‌లో 68 శాతం, అహ్మదాబాద్‌లో 60 శాతం, భువనేశ్వర్‌లో 58 శాతం చొప్పున ధరలు పెరిగాయి. మంగళూరులో 57 శాతం, త్రివేండ్రంలో 54 శాతం పెరగ్గా.. విశాఖపట్నంలో అన్నింటకంటే తక్కువగా 11 శాతం వృద్ధి నమోదైంది. టైప్ 2 నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నాలుగేళ్లలో 94 శాతం ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది.