06-03-2025 12:00:00 AM
నిర్మల్ మార్చ్ 5( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని బూరుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన రాథోడ్ రమేష్ కుటుంబ సభ్యులు భోజనం చేసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దట్టమైన పగలు రావడంతో గమనించగా ఇంటికి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకునే ఇల్లు మొత్తం కాలిపోగా ఆహార ధాన్యాలు బట్టలు నగదు కాలిపోవడంతో బాధితులకు 8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఉదయం రెవిన్యూ శాఖ అధికారులు బాధితులను పరామర్శించి వివరాలు సేకరించారు.