23-03-2025 04:01:43 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూరు మండలంలోని రేచిని గ్రామానికి చెందిన దండే మల్లన్నకు చెందిన పెంకుటిల్లు ఆదివారం మధ్యాహ్నం అర్ధమైంది. ఈ సంఘటనలో చెలరేగిన మంటల్లో ఇంట్లోని వస్తువులు, నగదు కాలిపోయాయి. మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు దండే మల్లయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.