calender_icon.png 1 April, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ దీపం ఇల్లు కాల్చింది

30-03-2025 04:03:01 PM

దేవునికి ద్వీపం పెట్టి నైవేద్యం పెట్టేందుకు మోతుకాకులకు వెళ్లిన కొత్తపల్లి మాసమ్మ

ఆకులు తీసుకుని వచ్చేసరికి ఇల్లు ఆగ్నికి ఆహుతి

ఇల్లు తాళం పగలగొట్టి మంటలు ఆర్పిన గ్రామస్తులు

గండీడ్: దేవుని దీపం ఓ గ్రామంలో ఇల్లును అంటి పెట్టిన హృదయ విధాయక సంఘటన ఉగాది పండుగ వేళ మనసులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గండీడ్ మండలం మనసు పల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి మాసమ్మ ఇంట్లో ఒక్కరే నివాసం ఉంటున్నారు. మాసమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. కొత్త సంవత్సరం, ఉగాది పండుగ ఉండడంతో ఇల్లును మొత్తం శుద్ధి చేసుకుని భగవంతుని చిత్రం పటాల దగ్గర ద్వీపం పెట్టింది. ఒక్కరే ఉండడంతో ఇల్లుకు తాళం వేసి దేవుడికి నైవేద్యం పెట్టేందుకు మోతుకాకులకు తీసుకువచ్చేందుకు ఊరు చివరికి వెళ్ళింది.

దేవుని చిత్రపటాల దగ్గర ఉంచిన ద్వీపం నుంచి మంటలు అధికంగా వ్యాపించడం జరిగింది. బండల ఇల్లు కావడంతో  ఇల్లు పై కప్పు కింది భాగంలో కట్టెలు అధికంగా ఉండడంతో ఒక్కసారిగా కట్టెలు అంటుకున్నాయి. దీంతో ఇల్లు అంతట మంటలు వ్యాపించడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు బయటికి కనిపించడంతో ఒకసారిగా ఆ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న సిలిండర్ ను బయటకు ముందుగా తీసుకువచ్చారు. గ్రామస్తులు కొందరు ముందస్తు జాగ్రత్తగా సిలిండర్ బయటకు తీసుకురావడంతో పేలే ప్రమాదం తప్పింది.

వ్యాపిస్తున్న మంటలను నీళ్లు పోసి ఆర్పినారు.  మోతుకాకులు తీసుకొని భగవంతుడికి అప్పటికే చేసిన నైవేద్యాన్ని పెడదామనుకున్నా కొత్తపల్లి సత్యమ్మకు తీవ్ర విషాద దృశ్యం కనిపించింది. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం కనిపించడంతో కన్నీరు పెట్టుకుంది. దీంతో ఊరంతా ఉగాది పండుగ వేళ ఇలాంటి సంఘటన జరగడం శోచనీయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వివిధ వస్తువులు పూర్తిగా కాలిపోవడం జరిగిందని కొత్తపల్లి సత్యమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు.