12-03-2025 01:19:53 PM
లక్షెట్టిపేట, విజయక్రాంతి : దండేపల్లి మండలం నంబాల గ్రామపంచాయతీ పరిధిలోని రాసపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్(electrical short circuit) తో ఒక ఇల్లు దగ్ధమైంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సల్ల చంద్రయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఐ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోనే నిత్యవసర సరుకులు, వస్తువులు, ఫ్రిడ్జ్ టీవీ బెడ్లు తదితర అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అరుపులు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పారు. సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు చంద్రయ్య విలపిస్తూ పేర్కొన్నారు. సంబద్ అధికారులు తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.