జగిత్యాల అర్బన్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని పొలాస గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆది వారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గంగారం అనే వ్యక్తి ఇంటికి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి దేవాల యాన్ని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపో వడం వలన ప్రాణాపాయం తప్పినప్పటికీ, అగ్ని ప్రమాదం వల్ల రూ. 8లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమైయ్యాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా సాయమం దించాలని స్థానికులు కోరుతున్నారు.