మాజీమంత్రి కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఏసిబి విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సోమవారం సుమారు ఉదయం 5:30 నిమిషాలకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లా లగ్జరియా విల్లాస్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్‌ఎస్ నేత మేకల విద్యాసాగర్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.