calender_icon.png 9 November, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

09-11-2024 12:31:48 AM

నల్లగొండ, నవంబర్ 8 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతలను శుక్రవారం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. యా దాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెంలో సీఎం మూసీ పునరుజ్జీవ యాత్రను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించడంతో పోలీ సులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని నల్లగొండలో, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చిట్యాలలో, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా కర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిర్బంధించారు.

జిల్లాలోని పలువురు కీలక నేతలను స్థా నిక పోలీసులు సీఎం పాదయాత్ర ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తీవ్రంగా ఖండించారు. మూసీ నది మురుగు కూపంగా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనే కారణమని ఆయన విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో భారీగా దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.