calender_icon.png 1 November, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

48 గంటలు సైలెన్స్

12-05-2024 03:01:03 AM

రాజకీయ పార్టీలు భోజనాలు పెడితే కేసులు 

పోలింగ్ ముగిసేదాకా వైన్ షాపులు బంద్ 

పోల్ క్యూ యాప్‌తో క్యూ లైన్ తెలుసుకోవచ్చు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికలు సోమవా రం జరుగనున్న నేపథ్యంలో నగర వ్యాప్తం గా సైలెన్స్ పీరీయడ్ కొనసాగనున్నది. ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే దాకా 48గంటలు కొనసాగే ఈ సైలెన్స్ పీరియడ్‌లో ఎన్నికల ప్రవర్తనా, నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులు, రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా చర్యలు చేపట్టనుంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఒక వైపు ఎన్నికల అధికారుల నిఘా, మరో వైపు పోలీసు అధికారులు బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. మహా నగరంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపర్చే స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికలు ముగిసే వరకు నగరంలో వైన్‌షాపులు బంద్ అవుతాయి. 

గుంపులుగా ప్రచారం చేయొద్దు 

ఎన్నికల ప్రచారం ముగిసిన 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే 13వ తేదీ సాయంత్రం 6 గంటల దాకా రాజకీయ పార్టీలు మైకులతో ప్రచారం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతించదు. కాని ఎన్నికల నిబంధనల ప్రకారం 5నుంచి 10మంది మాత్రం ఇంటింటి ప్రచారానికి అనుమతి ఉన్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి మైకులతో కానీ, గుంపులు గుంపులుగా ప్రచారానికి అనుమతించమని చెప్పారు.

బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టయితే వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి వివాదాలు, అల్లర్లు చోటు చేసుకున్న వెంటనే క్విక్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపడతాయి. 

భోజనాలు పెడితే కేసులు నమోదు

రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేసే ఓటు స్లిప్‌లు ఎలాంటి ప్రింటింగ్ ఉండకూడదు. తెల్ల కాగితంపై మాత్రమే రాసి ఓటర్ల కు ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ఓట ర్లకు భోజనాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగరంలో పోలింగ్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసే భోజనాలు తప్పా.. మరెక్కడైన హోటళ్లు తెరిచినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌ఓ నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా గుర్తింపు కార్డును కచ్చితంగా చూపించాలని సూచిస్తున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే పోలింగ్ క్యూ లైన్ తెలు సుకునే పోల్ క్యూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రద్దీలేని సమయంలోనే ఓటుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. వేసవి తీవ్రత కారణంగా ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 6 దాకా పెంచిన సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 6 లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు చిట్టీలు ఇవ్వనున్నారు.