తిరుమల,(విజయక్రాంతి): కలియుగ ప్రత్యేక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సర్వదర్శనానికి మూడు కంపార్టుమెంట్లలో భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. గురువారం 51,349 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 14,082 మంది భక్తులు తలనీలాలు సమార్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవాలయం అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (Sarvadarsan) 8 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.