calender_icon.png 16 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

15-07-2024 12:07:17 AM

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఏపీలోని తిరుమలలో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో టోకెన్లు లేని సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ అదేశాల మేరకు క్యూలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, తాగునీరు అందజేస్తున్నారు.