calender_icon.png 25 February, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్

25-02-2025 01:52:52 AM

కరీంనగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలి పారు.

సైలెంట్ పీరియడ్లో బహిరంగ సభ లు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయ పరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపడంపై ఎన్ని కల సంఘం నిషేధం విధించిందని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని రిటర్నింగ్ అధికారి కోరారు.

ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఈ ప్రత్యేక సెల వు వర్తిసుదని పేర్కొన్నారు.

వ్యాపార, వాణి జ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని ప్రైవే ట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యలు అ నుమతి, వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.