calender_icon.png 1 February, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31న బెల్లంపల్లిలో హోటళ్ళు బంద్

29-01-2025 05:43:53 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈ నెల 31న బెల్లంపల్లి పట్టణంలోని హోటళ్ళు (టీ, టిఫిన్, మిర్చి బండ్లు, మీల్స్ బిర్యానీ) బంద్ చేయాలని బెల్లంపల్లి హోటల్ యూనియన్ అధ్యక్షులు పిలుపునిచ్చారు. అన్ని హోటళ్ళలో పనిచేస్తున్న హోటల్ యూనియన్ సభ్యుల సమస్యలపై, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిన తీరుపై హోటల్ యూనియన్ నిర్ణయించిన రేట్లు అమలుపరచడానికి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి పట్టణంలో హోటళ్ళ బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు.