రైతులను ప్రోత్సహించేందుకు విజయ డైరీ పాలను కొనుగోలు చేయాలి
నిజామాబాద్ (విజయక్రాంతి): విజయ పాల ఉత్పత్తులను నిజామాబాద్ లోని హోటల్ యజమానులు వినియోగించుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. శుక్రవారం నిజామాబాదులో హోటల్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డైరీ పాల ఉత్పత్తులను పాలను వినియోగించుకోవాలనీ రైతులకు మేలు చేసిన వారు అవుతారని అన్నారు. ఇతర పాల ఉత్పత్తులు వాడకుండా కేవలం ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయ పాల ఉత్పత్తులను వినియోగించుకోవాలని కోరారు. దానికి హోటల్ యజమానులు సానుకూలంగా స్పందించారు.
మా పాలు మా వినియోగం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ పాల ఉత్పత్తులను పెంచేందుకు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్ హుందాన్, రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రత్నాకర్ నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు.