calender_icon.png 6 April, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్ నిర్వాహకుడికి ఒక రోజు జైలు శిక్ష

05-04-2025 02:34:04 AM

బోధన్, ఏప్రిల్ 4 :(విజయ క్రాంతి) బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో రాత్రి పరిమితి కి మించి టీ స్టాల్ (హోటల్) నిర్వహించిన షేక్ ఖాజా అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి.

ఎదుట హాజరుపరచడంతో సదరు హోటల్ యజమానికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. పట్టణంలో నిర్దేశించిన రాత్రి సమయంలో ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ తప్ప రాత్రి 10:30  తర్వాత హోటల్లు, దాబాలు కానీ ఏదయినా వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.