ఆరోజుల్లో చన్నీళ్లను వేడి చేసే వస్తువులు విచిత్రంగా ఉండేవి. కొందరు కట్టెలపొయ్యి మీద నీటిని వేడిచేస్తే.. మరికొందరు బాయిలర్ (పెద్ద గిన్నె)లో నీటిని వేడి చేసేవాళ్లు. ఇది కట్టెల పొయ్యికి భిన్నంగా ఉం టుంది. కింద అమర్చిన చిన్నపాటిబాక్సులో బొగ్గులు వేసి, నిప్పు రాజేస్తే నిమిషాల్లో నీళ్లు వేడెక్కేవి. ఒకసారి నిప్పు పెట్టి వదిలిస్తే చాలు నీళ్లు మరుగుతుండేవి.
అలా మరిగిన నీటిని స్నానం, ఇతర అవసరాలకు వాడుకునేవారు. అప్పట్లో మధ్య తరగతి ఇండ్లలో ఎక్కువగా కనిపించేవి. రాగి, ఇత్తడి రూపాల్లో ఉండే ఈ బాయిలర్ ఆకర్షణీయంగా ఉండేది. అయితే ఆ తర్వాత ఎలక్ట్రానిక్ హీటర్ అందుబాటులోకి రావడంతో బాయిలర్ కనుమరుగైంది. కానీ ఇప్పటికీ తెలంగాణలో కొన్నిచోట్ల బాయిలర్స్ కనిపిస్తుండటం విశేషం.