calender_icon.png 21 September, 2024 | 8:14 AM

హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలు విడుదల

21-09-2024 01:25:29 AM

వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ, జీఆర్‌ఎల్ జాబితా

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 2022లో గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, ఈ ఏడాది జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు గత కొన్ని రోజు లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో తాజాగా ఫైనల్ కీతో పాటు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్)ను విడుదల చేశారు. కొన్ని పోస్టులకు వేర్వేరుగా జీఆర్‌ఎల్‌ను ప్రకటించినట్లు తెలిపారు. జూలై 18న ప్రిలిమినరీ కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. వీటిపై నిపు ణుల కమిటీ తుది నిర్ణయం తీసుకొని ఫైనల్ కీ, జీఆర్‌ఎల్ ఒకేసారి విడుదల చేసింది. వివిధ శాఖల్లో కలిపి 581 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దాదాపు 1.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలి తాలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంద ర్శించాలని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.