18-03-2025 12:48:30 AM
581 పోస్టులకు 574 మంది ఎంపిక
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస ర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు సోమవారం టీజీపీఎస్సీ ప్రొవిజినల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది. మొత్తం 581 పోస్టులకుగానూ 574 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. తుది జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపింది.
గత ఏడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో రాత పరీక్షలను నిర్వహించారు. మొత్తం 581 పోస్టులకు గాను 1,45,359 మంది దరఖాస్తు చేసుకోగా, 82,873 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గతేడాది (2024) జూన్‌లో పరీక్షలు జరుగగా.. ఇప్పటికే జీఆర్‌ఎల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది. తాజాగా తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.