18-04-2025 12:00:00 AM
ఎంపీ ఆర్ కృష్ణయ్యకు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): హాస్టల్ మెస్ బిల్లులు, అద్దె బకాయిలు మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఐదు నెలల బీసీ కాలేజీ హాస్టళ్ల మెస్ బిల్లులు, మూడేళ్లు అద్దె బిల్లులు, ఏడాది కరెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు.
ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హాస్టల్ బిల్లులతోపాటు రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలూ చెల్లించాలని విజ్ఞప్తి చేయగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు.