* బ్యాగ్‌లో పెట్టుకొని చికిత్స కోసం వెళ్లిన మహిళ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: భూ వివాదంలో బంధువే ఓ మహిళ ముక్కును కత్తిరించగా.. సదరు మహిళ తన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకొని హాస్పిటల్‌కు వెళ్లింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జలోర్ జిల్లా సైలా డివిజన్ మోక్నీలో కుకీదేవి(40) నివాసముంటుంది. గ్రామంలోని స్థలం విషయమై కుకీదేవి మామ, మేనల్లుడి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో కుకీదేవి మేనల్లుడు ఓం ప్రకాశ్ కుకీదేవి ముక్కును కత్తితో కోసేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులోని తన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకొని పాలిలోని బంగర్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి జోధ్‌పూర్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ జుగల్ మహేశ్వరి మాట్లాడుతూ... ఆమె ముక్కును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తిరిగి అతికించే అవకాశం ఉందని వెల్లడించారు.