calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షబ్బీర్ అలీ కృషితోనే 50 పడకల ఆసుపత్రి మంజూరు

12-04-2025 06:57:27 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కృషితోనే దోమకొండ మండల కేంద్రములోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని, 50 పడకలుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. దోమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి  మాట్లాడారు. షబ్బీర్ అలీ అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడేవాడని వివరించారు. గతంలో విద్యుత్తు. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2008లో దోమకొండలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు వివరించారు.

అలాగే 2010లో 30 పడకల ఆసుపత్రిని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్, మంత్రి సుదర్శన్ రెడ్డి నా చేతుల మీదుగా ప్రారంభింపచేశారని వివరించారు. ప్రస్తుతం రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరి షబ్బీర్ అలీ 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రభుత్వ జీవోను తెప్పించాడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. షబ్బీర్ అలీ ఎప్పటికీ  శాశ్వత పథకాలపై దృష్టి సారిస్తారనీ అన్నారు. ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిగా మార్చడంతో దోమకొండకు అదనంగా 14 పోస్టులు కొత్తగా మంజూరు కానున్నట్లు తెలిపారు. 30 పడకల ఆసుపత్రి ఉండగా 14 మంది డాక్టర్లు పనిచేస్తుండగా, 50 పడకల ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకులు వివరించారు.

దోమకొండ మండలంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రభుత్వ వైద్యం అందగా ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని పలుసార్లు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకురావడంతో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు తెప్పించారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, సీతారాం మధు, కలీం తదితరులు పాల్గొన్నారు.