calender_icon.png 1 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలి

01-02-2025 01:13:28 AM

జగిత్యాల అర్బన్, జనవరి 31: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మత్తు పనులను వేగంగా పూర్తయ్యేలా చూడా లని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారుల ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ప్రభు త్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికం గా తనిఖీ చేసారు.

ఆసుపత్రిలో జరుగుతు న్న పలు మరమ్మత్తుల పనులను   పరిశీ లించి, సెప్టిక్ ట్యాంక్, పెయింటిం గ్, టాయిలెట్, డ్రైనేజీ, వాటర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రధాన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, పలు వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకు న్నారు. పలు వార్డుల్లోని రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు.

వంటగది, స్టోర్ రూమ్ బియ్యం ముడి సరుకులు కూరగాయలు నాణ్యమైనవి అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట, ఎమ్మార్వో రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, ఆర్‌ఎంఓ సుమన్ తదితరులున్నారు. 

నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలి

నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. బీర్పూర్ మండలం మంగేల గ్రామంలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఆయన  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, పడక బెడ్లను, వంటశాలను, స్టోర్ రూం, ఫుడ్ ప్రొవిజన్స్ పరిశీలించారు.

నాణ్యమైన బియ్యం, ముడి సరుకులు  అందించాలని, విద్యార్థులకు నూతన డైట్ మెనూ ప్రకారం రోజువారి భోజనం ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో డ్రైనేజీ సమస్యను కలెక్టర్ దష్టికి తీసుకురాగా, వెంటనే మర మ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల నిర్వహణ, భోజన ఏర్పా ట్లలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలోని పల్లె దవఖాన సబ్ సెంటర్నీ అకస్మిక తనిఖీ చేసి, రికార్డులు, మందులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోజు వారి ఓపి సేవల గురించి ఆరా తీశారు.  వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, సంబంధిత అధికారులున్నారు.