calender_icon.png 20 April, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్పటల్ భవన నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలి

10-04-2025 02:24:10 AM

కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట,ఏప్రిల్9(విజయక్రాంతి): సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో  నిర్మిస్తున్న 650 పడకల భవన   నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  వైద్య అధికారులు, టి ఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ నూతన భవన నిర్మాణం ప్లానింగ్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సత్యనారాయణ, టి ఎస్ ఎం డి సి సి ఈ దేవేందర్, ఈ ఈ జైపాల్ రెడ్డి, హెచ్ ఓ డి లు, ఎ ఈ లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.