12-02-2025 12:45:40 AM
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్య’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ,వామిండియా బ్యానర్లపై ఇషారి కె గణేష్, అనిష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత పా. విజయ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది.
ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘మీరు ఇప్పుడు దాదాపు 120 సంవత్సరాల క్రితం జీవించిన ఆత్మలను కలవబోతున్నారు’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హారర్ ఫాంటసీ అంశాలు, సినిమా నేపథ్యం ఏంటనేది ట్రైలర్‌లో చూపించారు.
ట్రైలర్‌ను బట్టి చూస్తే దర్శకుడు పా. విజయ్ ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో థ్రిల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం చిత్రానికి మరో హైలైట్‌గా నిలవనుంది. ‘అగత్య’ అనేది ది అవెంజర్స్ మాదిరిగానే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ‘అగత్య’ చిత్రం ఫిబ్రవరి 28, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.