calender_icon.png 10 January, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాహుబలి మేకర్స్‌తో హారర్ కామెడీ ఎంటర్‌టైనర్

08-01-2025 12:00:00 AM

అక్కినేని నాగచైతన్య కెరీర్ ప్రారం భం నుంచి కొంచెం వైవిధ్యంగానే సాగు తోంది. ఫలానా జానర్ అంటూ అంకితం కాకుండా అన్ని రకాల జానర్స్‌లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న నాగచైతన్య ఇప్పుడు వరుసగా చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘తండేల్’లో నటిస్తున్నాడు. అలాగే ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌ను సైతం ‘ఎన్‌సీ 24’గా అనౌన్స్ చేసేశాడు.

అదీగాక తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును సైతం లైన్‌లో పెట్టాడని సమాచారం. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌లో రూపొందనున్న చిత్రంలో నాగచైతన్యే హీరో అని తెలుస్తోంది. ఈ చిత్రం హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందట. ఇప్పటికే మంతనాలు కూడా పూర్తయ్యా యట. గత కొంతకాలంగా వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్ మాత్రమే తీస్తున్న ఈ సంస్థ తాజాగా సినిమా నిర్మించాలని ఫిక్స్ అయ్యిందట.

ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్‌లో ‘ఆక్సీజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే రెండు చిత్రాలు రానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే నాగచైతన్యతో సినిమా చేయాలని శోభు యార్లగడ్డ ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. మొత్తానికి ‘బాహుబలి’ మేకర్స్‌తో సినిమా చేయనుండటంతో నాగచైతన్య అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.