calender_icon.png 19 January, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల్లో చిగురించిన ఆశలు

19-01-2025 12:00:00 AM

  1. ధర్నాతో పెరిగిన ధైర్యం
  2. మా భూములు మాకే దక్కుతాయని ధీమా

పటాన్‌చెరు, జనవరి 18 : వెలిమెల తండాలో తాతల నుంచి సాగులో ఉన్న మిగులు భూములు(బిలా దాఖలు) గిరిజనులకే చెందాలని ఎంపీ రఘునందన్రావు  శుక్రవారం చేపట్టిన దర్నా గిరిజనుల్లో ధైర్యం నింపింది.  మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడు గంటల వరకు గిరిజనులతో కలిసి ఎంపీ చేపట్టిన ధర్నా, ఆందోళనలు  వారిలో ఆశలు చిగురింపజేసింది. మా భూములు మాకే  చెందుతాయనే ధీమాను కల్పించింది. 

ధర్నాను భగ్నం చేసి ఎంపీ రఘునందన్రావును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా గిరిజన మహిళలు, పురుషులు ఎంపీని చుట్టు ముట్టి అరెస్టు చేయకుండా అడ్డకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని వంటావార్పుతో రెండు రోజులైన ఇక్కడే ఉంటామని ఎంపీ గిరజనులకు ధైర్యం ఇచ్చారు.

గిరిజనులకే భూములు చెందాలని దీని కోసం ఎంత వరకైనా పోరాడుతామని ఎంపీ ధర్నాలో మాట్లాడి గిరిజనుల్లో భూములపై ఆశలు రేపారు.  1994లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను రెవెన్యూ అధికారులు అమలు చేయలేదని,  రెండు, మూడు సంవత్సరాల క్రితం వ్యాపారస్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్ల మీద సుమారు 25 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ జరిగిందని వెలిమెల తండా వాసులు ఆందోళన చేయడంతో సమస్య భహిర్గతమై వివాదం ఏర్పడింది. 

పైగా బిలా దాఖలు భూములు సుమారు 80 ఎకరాల చుట్టూ రాత్రికి రాత్రే బౌన్సర్లను పెట్టి గిరిజనులను భయపెట్టి ప్రహారీ నిర్మించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఎంపీ వారికి మద్దతుగా నిలిచారు.

సుమారు ఎనబై సంవత్సరాలుగా సాగులో ఉన్న బిలా దాఖలు భూములు గిరిజనులకే చెందాలని ఆయన ధర్నాలో పాల్గొనడంతో వెలిమెల తండా భూముల సమస్య రాష్ట్ర వ్యాప్తం అయ్యింది.  వివాదం ఏర్పడిన భూముల విలువ సుమారు 1500కోట్ల వరకు ఉంటుంది.