calender_icon.png 22 December, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోరెన్‌పె ‘ఇండియా’ గంపెడాశలు

02-11-2024 10:53:09 PM

దట్టమైన అడవులతో ‘వనాంచల్’గా పిలువబడే ఖనిజాలకు నిలయమైన గిరిజనుల గడ్డ జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారుతోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ..ఈ ఐదు రాష్ట్రాల సరిహద్దులతో భిన్న సంస్కృతికి నెలవైన జార్ఖండ్‌లో జనాభారీత్యా అధిపత్యంలో ఉన్న గిరిజనులు అధికారాన్ని శాసించనున్నారు. నవంబర్ 13, 20 తేదీలలో రెండు విడతలలో జరగనున్న శాసనసభ ఎన్నికలు ప్రధానంగా గిరిజనుల చుట్టే తిరుగున్నాయి.

మొదటినుంచీ రాజకీయ అనిశ్చితి

ఉమ్మడి బీహార్‌కు వేసవి విడిది అయిన రాంచీ రాజధానిగా 2000 సంవత్సరం లో ఏర్పడిన జార్ఖండ్  రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి సుదీర్ఘకాలంగా కొనసాగు తోంది. 24 ఏళ్లలో ఏడుగురు ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపట్టగా, 13 సార్లు ప్ర మాణస్వీకారాలు జరిగాయి. బీజేపీ అధికంగా 13 ఏళ్లు అధికారంలో ఉంది. బీజేపీ నేత రఘబర్ దాస్ మాత్రమే పూర్తి స్థాయి లో ఐదేళ్లు (2014-19) సీఎంగా ఉండగా, మిగతా ఆరుగురు సీఎంలు పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.

రాజకీయ అనిశ్చితితో అభివృద్ధిలో వెనుకబడి న జార్ఖండ్‌లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఉం డాలని ప్రజలు కోరుకోవడంతో 2014లో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టగా, ప్రభుత్వ వ్యతిరేకతతో 2019లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2019లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమిని ప్రజలు స్ప ష్టమైన మెజార్టీతో గెలిపిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వాతావరణం ఏర్పడుతోందని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఐదేళ్లూ జేఎంఎం ప్రభుత్వం కొనసాగినా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై కేసులతో ఆయన పాలనకు మధ్యలో ఆరు నెలల విరామం ఏర్పడింది.

నాలుగేళ్లుగా సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్‌పై మనీలాండరింగ్ కేసులు నమోదుకావడం అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారింది. కేసుతో పదవి కోల్పోయిన ఆ యన బెయిల్ రావడంతో గత జులైలో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. హేమంత్ సోరెన్ జైలులో ఉన్న 150 రోజుల అనిశ్చితితో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. సోరెన్ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చంపాయి సోరెన్ సీఎం బాధ్యతలు చేపట్టారు.

హేమంత్ సోరెన్ తిరిగి సీఎం కాగానే చంపాయి సోరెన్ బీజేపీలో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పట్టున్నా ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమిలో, బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీ(యూ), లోక్‌జనశక్తి పార్టీల ‘ఎన్డీఏ’ కూటమిలో సీట్ల కేటాయింపులో తొలుత లుకలుకలు కనిపించినా సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది.

ఎన్డీఏ’లో బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) 2, లోక్‌జనశక్తి 1 స్థానంలో పోటీ చేస్తుండగా, ‘ఇండియా’లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేస్తుండగా,  సీపీఐ(ఎమ్‌ఎల్)ఎల్  విషయంలో కొంత గందరగోళం నెలకొంది.

అధికారాన్ని నిర్ణయించే గిరిజనులు

జార్ఖండ్‌లో ఎన్నికల వాతావరణాన్ని అంచనా వేయడానికి ‘పీపుల్స్ పల్స్’ బృం దం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చా యి. రాష్ట్రంలో 26 శాతానికిపైగా ఉన్న గిరిజనుల చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా వాటిలో 28 రిజర్వుడ్ స్థానాలున్నాయి.  24 జిల్లాలుండగా 21 జిల్లాల్లో లక్షకుపైగా గిరిజనులున్నారు. 43 స్థానాల్లో 20 శాతానికిపైగా గిరిజనుల జనాభా ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా’, ‘ఎన్డీఏ’ కూటము లు గిరిజనులపైనే పూర్తి దృష్టి సారించాయి.

రాష్ట్రంలో ఆధిపత్యంలో ఉన్న గిరిజన నేత హేమంత్ సోరెన్‌కు ఆ సామాజికవర్గంలో గట్టి పట్టుంది. ఆయనను కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో అరెస్టు చేసిందని గిరిజనుల్లో ఆగ్రహం ఏర్పడడంతో బీజేపీ నష్ట నివరణ కోసం చంపాయి సోరెన్, మాజీ సీఎం శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్, గిరిజన సీనియర్ నేత అర్జున్ ముండా వంటి నేతలతో పార్టీని పటిష్టం చేయాలని చూస్తోంది. మొ న్నటి లోక్‌సభ ఎన్నికల్లో  మొత్తం 14 స్థా నాల్లో 9 ఎన్డీఏ గెలిచినా, 5 రిజర్వుడ్ స్థా నాలనూ ‘ఇండియా’ కూటమి దక్కించుకుంది.

గిరిజనుల్లో పట్టున్న ‘ఇండియా’ కూటమి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గంపెడాశలు పెట్టుకుంది. మహిళల కోసం తీసుకొచ్చిన ‘మాయియా సమ్మాన్’ పథకంతో వారికి ఆర్థిక సాయం అందుతుండడంతో వారు గట్టెక్కిస్తారని భావిస్తోంది. దీంతోపాటు ఆప్కీ యోజన, ఆప్కీ సర్కార్, ఆప్కీ ద్వారా, అబువా ఆవాస్, పింఛన్ పథకాలు, ఆ హార భద్రత, క్రీడలు, విద్యా పథకాలను అ మలు చేయడంతో లబ్ధి చేకూరుతుందని ‘ఇండియా’ కూటమి ఆశావహంగా ఉంది.

హేమంత్ సోరెన్ అరెస్టు కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి అనే సానుభూతి ఏ ర్పడిందని, అది ఎన్నికల్లో అనుకూలంగా మారనుందని కూటమి భావిస్తోంది. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందనే ప్రచారాన్ని సీఎం సతీమణి కల్పనా సోరెన్ ప్రజల మధ్యకు విజయవంతంగా తీసుకెళ్లగలిగారు. ఈ పరిణామాలకు తోడు రాష్ట్రంలో దాదాపు 15 శాతం ఉన్న ముస్లిం సామాజికవర్గం ఏకపక్షంగా ‘ఇండియా’ కూటమి వైపు ఉండడం వారికి సానుకూలమైన అంశం. 

సోరెన్ అవినీతి ప్రభావం

కేంద్ర ప్రభుత్వం కేసులతో వేధిస్తోంద ని జేఎంఎం నేతలు చెబుతున్నా ముఖ్యమంత్రి మొదలుకొని పలువురు కీలక నేత లు అవినీతి కూపంలో కూరుకుపోయారనే ప్రచారం కూడా జోరుగా ఉండడం ‘ఇండియా’ కూటమికి వ్యతిరేకంగా మారుతోంది. జార్ఖండ్‌లో ప్రభుత్వం పలు సంక్షే మ పథకాలు ప్రవేశ పెట్టినా రాష్ట్రంలో నిరుద్యోగం, అభివృద్ధి కుంటుపడడం వంటి ప్రభుత్వ వ్యతిరేకాంశాలు ‘ఇండియా’ కూటమికి నష్టం చేకూర్చవచ్చు. జేఎంఎంకు గిరిజనుల్లో పట్టున్నా ఆ పార్టీలో హేమంత్ సోరెన్ కుటుంబ ఆధిపత్యం పెరిగిపోయిందనే విమర్శలతో ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీని వీడడం మైనస్‌గా మారింది. 

మోదీ చరిష్మాపైనే ఆశలు

2019లో ఒంటరిగా పోటీ చేసి ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ప్రధానం గా ఏజేఎస్‌యూతో విజయవంతంగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుంది. ఆ పార్టీ మోదీ చరిష్మాపైనే అధికంగా ఆశలు పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది నెలల క్రితం జార్ఖండ్‌లో వేలాది కోట్ల రూ పాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్డీఏ ‘పంచ్ ప్రాణ్’ పేరుతో ఎన్నికల హామీలు గుప్పిస్తొంది. బంగ్లాదేశ్ అక్రమ వసలదారుల తో స్థానికులు అవకాశాలు కోల్పోతున్నారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో కీలక అస్త్రం గా మార్చుకుంటోంది. గిరిజనుల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ చాపకింద నీరులా చేస్తున్న ప్రచారం బీజేపీకి సానుకూలంగా మారుతోంది.

అయితేగిరిజనుల్లో పట్టు కోసం ఎన్నికల ముందు పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతో బీజేపీ బలోపేతం కా వడం అటుంచి, నేతల మధ్య ఆధిపత్య పో రు నష్టం చేకూరుస్త్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానికాంశా లే  ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలుండడంతో మోదీ చరిష్మా పనిచేయకపోవచ్చు.  కేసులతో హేమంత్‌ను జైలుకు పంపారనే అసంతృప్తి గిరిజనుల్లో ఉండడం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారింది. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందనే ప్రచారం కూడా ప్రజల్లో బలంగా వెళ్లడం ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు.

ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పగ్గాలు కోసం అధికార ‘ఇండియా’, ప్రతిపక్ష ‘ఎన్డీఏ’ కూటముల రాజకీయాలు గిరిజనులు, ప్రజాకర్షణ పథకాల చుట్టూ తిరుగుతున్నా సీఎం హేమంత్ సోరెన్‌పై మనీలాండరింగ్ కేసులు కూడా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41 సంఖ్యను ఏ కూటమి దక్కించుకుంటుందో ఈ నెల 23న వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.

వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, 

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.