calender_icon.png 15 November, 2024 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసితుల ఆశలు ఆవిరి

24-09-2024 12:13:48 AM

  1. ఉత్తర భాగం అలైన్‌మెంట్‌లో నో చేంజ్ 
  2. అభివృద్ధి పనులకు ఇప్పటికే రెండు, మూడుసార్లు భూములు కోల్పోయాం..
  3. మళ్లీ నష్టపోవాలా ? అలైన్‌మెంట్ మార్చలేరా? 
  4. రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు ఏమయ్యాయని రైతుల నిలదీత

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో ని రాయిగిరితో పాటు పలు గ్రామాలకు చెందిన వారు ఇప్పటికే భూసేకరణ పేరిట రెండు, మూడుసార్లు భూములు కోల్పోయారు. తాజాగా ఉత్తర భాగంలో ఆర్‌ఆర్ ఆర్ నిర్మాణానికీ భూములు కోల్పోవాల్సిన దుస్థితి. దీంతో నిర్వాసితులు అలైన్‌మెంట్ మార్చాలని కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో ఇప్పటికే బాధిత రైతులు అనేకసార్లు సర్వే పనులు, భూసేకరణను సైతం అడ్డుకున్నా రు. 

న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిం చి మరీ స్టే ఉత్తర్వులు పొందారు. బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి సైతం హామీ ఇచ్చారు. బాధితుల పక్షా న నిలబడి అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సైతం బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఓ రోడ్ షోలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కూడా న్యాయం చేస్తామని భరోసా ఇప్పించారు.

నిర్మాణం ఇలా..

హైదరాబాద్ మహానగరానికి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో అలైన్‌మెంట్ నిర్ధారణ, భూసేకరణ, నిధుల కేటాయింపు వంటి కీలకమైన అంశాలు తుది దశకు చేరుకున్నాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెవెన్యూ యం త్రాంగం సన్నాహాలు చేస్తోంది. త్వరలో నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇప్పటికే అధికారులు శంకుస్థాపనకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. సం గారెడ్డి నుంచి ప్రారంభమయ్యే ఆర్‌ఆర్‌ఆర్ రహదారిని ఉత్తరం, దక్షిణంగా అధికారులు విభజించారు. ఇక్కడ రెండు దశల్లో పనులు జరుగనున్నాయి.

ఉత్తర భాగంలో సంగారెడ్డి  తుప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మీదుగా చౌటుప్పల్ వరకు 158.64 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. దక్షిణ భాగంలో యాదాద్రి భువ నగిరి జిల్లా పరిధిలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలోని 59.33 కి.మీ మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొద టి దశలో ఉత్తర భాగానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులు మంజూరయ్యాయి. డీపీఆర్ సిద్ధం సిద్ధమైంది. పనులకు 90 శాతం వరకు భూసేకరణ పూర్తయింది. ఒక్క భువనగిరి మండలంలోనే 9 కి.మీ రహదారి పొడ వునా రైతులు భూములు కోల్పోతున్నారు.

సీఎం ప్రకటనతో ఆవిరైన ఆశలు

ఎన్నికల ముందు అన్ని పార్టీలు నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పి మద్దతు పలికారని, ఎన్నికల తర్వాత కాం గ్రెస్, బీజేపీ పూర్తిగా చేతులేత్తేశాయని నిర్వాసితులు వాపోతున్నారు. ఒక్క వామపక్ష పార్టీలు మాత్రం తమకు అండగా నిలబడుతున్నాయంటున్నారు. ఇటీవల తాము ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నిర్వాసితుల సమస్యలను వివరించామని, సీఎం అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పు లు లేవని స్పష్టం చేశారన్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే చివరకు నిరాశే ఎదురైందని, ఎన్నికల ముందు తమను ఓటు బ్యాంక్‌గా వినియోగించుకున్నారని మండిపడుతున్నారు.