calender_icon.png 3 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెలరేగిన మనికా పతకంపె ఆశలు

06-08-2024 03:25:38 AM

  1. ప్రిక్వార్టర్స్‌లో రొమేనియాపై విజయం
  2. అదుర్స్ అనిపించిన శ్రీజ, అర్చన 

పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ (టీటీ) విభాగంలో భారత మహిళల బృందం క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. టీటీ వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన మనికా బాత్రా, ఆకుల శ్రీజ టీం విభాగంలో మాత్రం అదరగొట్టారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్ 3 తేడాతో రొమేనియాపై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక దశలో 2 భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి రొమేనియా వరుసగా రెండు విజయాలు సాధించి స్కోరు సమం చేసింది. దీంతో మనికా కీలకపోరులో తన అనుభవాన్ని రంగరించి మ్యాచ్ గెలవడంతో పాటు భారత్ క్వార్టర్స్ చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. 

ఆరంభం అదుర్స్

సోమవారం రొమేనియాతో జరిగిన క్వార్టర్స్‌లో తొలుత డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్ జోడీ విజయం సాధించి శుభారంభం చేసింది. ఆడిన మూడు గేముల్లోనూ ఈ జంట స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మూడు గేముల్లో వరుసగా 11 12 11 డయాకోను, సమర ఎలిజబెటాను ఓడించి భారత్‌ను 1 ఆధిక్యంలో నిలిపారు. ఆ తర్వాత సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో మనికా బాత్రా చెలరేగి ఆడింది. సింగిల్స్ మ్యాచ్‌లో మనికా 11 11 , 11 బెర్నాడెట్టేను మట్టికరిపించింది.

ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా విజయం అందుకున్న మనికా భారత్‌ను 2 పటిష్ట స్థితిలో నిలిపింది. ఈ దశలో రొమేనియా అద్భుతంగా ఫుంజుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 2 స్కోరును సమం చేసింది. సింగిల్స్ రెండో మ్యాచ్‌లో శ్రీజ 11 4 11 6 8 ఎలిజబెటా చేతిలో పరాజయం పాలైంది. మూడో మ్యాచ్‌లో అర్చనా కామత్ 5 11 7 9 బెర్నాడెట్టే చేతిలో ఓటమి చవిచూసింది.

చెలరేగిన మనికా

ఫలితాన్ని తేల్చేందుకు కీలకమైన ఐదో మ్యాచ్‌లో మనికా బాత్రా జూలు విదిల్చింది. రివర్స్ సింగిల్స్‌లో మనికా 11 11 11 డయాకోనును వరుస గేముల్లో ఓడించింది. తొలి గేమ్‌లో సునాయాసంగా విజయం సాధించిన మనికా రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో మ్యాచ్ పట్టు తప్పుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే మళ్లీ ఫుంజుకున్న మనికా మూడో గేమ్‌లోనూ విజయం సాధించడంతో భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.