calender_icon.png 18 January, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల మంజూరు ప్రకటనతో పేదల్లో చిగురించిన ఆశలు!

18-01-2025 12:00:00 AM

  • ప్రభుత్వ ప్రకటనతో సర్వత్రా హర్షం పంచాయతీ కార్యదర్శులకు 
  • దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం

సంగారెడ్డి, జనవరి 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అరులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటన చేయడంతో నిరుపేదల్లో ఆశలు చిగురించాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వలస వెళ్లిన పేదలు తిరిగి గ్రామాలకు వస్తున్నారు. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటించింది.

దీంతో గ్రామాలలో నిరుపేదలు తెల్ల రేషన్ కార్డులపై ఆశలు పెంచుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2024లో తెల్ల రేషన్ కార్డులు 3,52,376 లక్షలు, అంత్యోదయ కార్డులు 26103, అన్నపూర్ణ కార్డులు 100 ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం కార్డులు 3,78,579 రేషన్ కార్డులు ఉండగా, 12,33,167 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రతినెల తెల్ల రేషన్ కార్డుదారుల కోసం 7909.147 మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. 

తెల్ల రేషన్ కార్డులపై ఆశలు  

కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అరులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో పేదలు దరఖాస్తు చేసుకు నేందుకు గ్రామాలకు వస్తున్నారు. ఎంతో మంది పేదలు రేషన్ కార్డుల కోసం తాసిల్దార్ కార్యాలయం, మీ సేవలో చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయ డంతో గ్రామాలలో అధికారులు దరఖా స్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తు న్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శు లకు అరులైన వారు ఆధార్ కార్డుతో పాటు దరఖాస్తు ఫారం తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేదల నుంచి దరఖాస్తు స్వీకరించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న పేదలు అర్హులా.. కాదా అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. 

అనంతరం ఆన్లైన్ వారి పేర్లను గ్రామ సభల్లో ప్రకటిస్తారు. పట్టణ, గ్రామ స్థాయి లో దరఖాస్తు స్వీకరించి రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పాటించి సర్వే తీరు ను సమీక్ష చేస్తున్నారు.

ఇలాంటి లోటు పాట్లు లేకుండా సర్వే చేసి అరులైన వారిని గుర్తించాలని ఆదేశాలిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుపేదల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది.  తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం పంపిణీ చేసే సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉంటారని వారి ఆశ. దీంతో గ్రామాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది.