నిర్మల్, జనవరి 21 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న తమకు రూ.18,500 వేతనం చెల్లించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆశవర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పని చేస్తున్న ఆశ వర్కర్లు నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి తమ డిమాండ్‌లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. 2024లో ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని కోరారు. అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనం కల్పించాలని, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటో ఉద్యమం చేస్తామని ఆశ వర్కర్లు హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో వైద్య అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు సుజాత, నాయకులు చంద్రకళ, ఇంద్రమాల, పద్మ, వినోద, అనసూయ పాల్గొన్నారు.