భారత్, అర్జెంటీనా మ్యాచ్ డ్రా l గోల్‌తో మెరిసిన కెప్టెన్ హర్మన్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత పరుషుల హాకీ జట్టు తమ రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. పూల్ భాగంగా సోమవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1 డ్రా ముగించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (ఆట 59వ నిమిషంలో) గోల్ సాధించగా.. అర్జెంటీనా తరఫున లుకాస్ మార్టినేజ్ (22వ ని.లో) ఏకైక గోల్ నమోదు చేశాడు. తొలి సగం ఆట ముగిసేసరికి భారత్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. అప్పటికే అర్జెంటీనా గోల్ చేసి 1 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆశలు అడుగంటుతున్న వేళ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్ కొట్టి టీమిండియాను ఓటమి కోరల నుంచి కాపాడాడు. ప్రస్తుతం ఒక విజయం, ఒక డ్రాతో పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత్ వరుసగా ఐర్లాండ్, ఆస్ట్రేలియా, బెల్జియంలతో ఆడాల్సి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసి 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన హర్మన్‌ప్రీత్ సేన ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియా నేడు ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది.