calender_icon.png 26 November, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభల్లో గూండాయిజం చేస్తున్నారు

26-11-2024 02:47:08 AM

రాజకీయాల కోసం పార్లమెంటును నియంత్రించాలని ప్రయత్నాలు

విపక్ష నేతలపై పరోక్షంగా విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

నేడు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రజలు తిరస్కరిస్తున్నా కొందరు తమ రాజకీయ ప్రయోజ నాల కోసం పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై పరోక్షం గా ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలోని మీడియా పా యింట్ వద్ద ప్రధాని మాట్లాడుతూ.. ప్రజలు 80 సార్లు ఓడించినా గూండాయిజాన్ని ఆశ్రయించి సభల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

అయినా వారి వ్యూహాలు విఫలమవుతూనే ఉన్నాయని, వారి ప్రవర్తనను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారని అన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ అగౌరవపరుస్తారని విమర్శించారు. పార్లమెంటులో ఫలప్రదమైన చర్చలు మాత్రమే జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు.  

నేడు రాజ్యాంగ దినోత్సవం

సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ భవనం)లో మంగళవారం సంవిధాన్ దినోత్స వాలను నిర్వహించుకుందామని ప్ర ధాని మోదీ పిలునిచ్చారు. ఈ ఏడాది నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తవుతాయి. దానికి గుర్తుగా సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం. ప్రపం చం ఇప్పుడూ భారత్‌ను ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా సభలో మన ప్రవర్తన ఉండాలి.

ప్రజలు విశ్వసిస్తున్న పార్లమెంట్ వ్యవస్థకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఏ అంశంలోనైనా సరైన రీతిలో ప్రశ్నించడం ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలం. ఈ ప్రవర్తనతోనే రాబోయే తరాలు ప్రేరణ పొందుతాయి. ఈ సమావేశాలు ఫలవంతంగా ఉంటాయని ఆశిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు.  

రాజ్యాంగం, రాజకీయాలు వేర్వేరు: స్పీకర్ ఓం బిర్లా

భారత రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంతోనే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు వచ్చాయని, అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని పేర్కొన్నారు. సమాజంలో ఇంకా కొన్ని వర్గాలకు రిజర్వేషన్ల అవసరముందని, పేద, వెనుకబడిన తరగతుల అభివృద్ధితోనే సమాజం ముందుకు వెళ్తుందని ప్రధాని మోదీ చెప్తుంటారని ఓంబిర్లా గుర్తుచేశారు. మంగళవారం సంవిధాన్ సదన్‌లో జరిగే రాజ్యాంగ దినోత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని బిర్లా తెలిపారు.