25-02-2025 02:07:48 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 24: కరీంనగర్ జిల్లాకు టీ జి ఓ రాష్ర్ట అధ్యక్షులు ఎంప్లాయిస్ జె ఏ సీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు టీజీఓల రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సత్యనారాయణలు సోమవారం రాగ మర్యాద పూర్వకంగా కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్,
టిఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టీ జీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీ చరణ్ ల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు కరీంనగర్ ఉద్యోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా జేఏసీ నాయకులతో అల్పాహారం చేసి అనంతరం జగిత్యాల జిల్లా కు బయలుదేరి వెళ్లారు. వీరి వెంట టీజీవోల రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉండగా,
ఈ కార్యక్రమంలో టీజీవోల జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, టిఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, రామ్మోహన్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సమరసేన్, జగిత్యాల టీ జీ ఓ కార్యదర్శి మామిడి రమేష్, రోహిత్, అభినవ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కొండల్ రెడ్డి, కర్ణాకర్, పాల్గొన్నారు