18-03-2025 12:33:20 AM
కడ్తాల్, మార్చి 17 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)కు చెందిన విద్యార్థులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పాఠశాల స్థాయి వాలీబాల్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి ఢిల్లీకి జాతీ య స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా కొప్పు కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం క్రీడాకారులను శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టీ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు..
అదేవిధంగా విద్యా ర్థులలోని క్రీడా ప్రతిభను కనుక్కొని వారికి శిక్షణ ఇచ్చి వారికి కావలసిన వసతులు కల్పించిన పి ఈ టి భీముడు, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య శాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నా రు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు కాలే వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోతుగంటి అశోక్, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి మూడ రవి, బిఆర్‌ఎస్ యువజన నాయకులు సిద్ధిగారి సురేష్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఒగ్గు మహేష్, ముత్తి శ్రీశైలం, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.