20-04-2025 04:48:17 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడా మైదానంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన హాకీ క్లబ్ అధ్యక్షడు తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బొడిగె తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ సెక్రటరీ ఉమామహేశ్వర్ ని, లారీ అసోసియేషన్ గౌరవ సలహాదారులుగా ఎన్నికైన ఎండి సజ్జుని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హుజురాబాద్లో హాకీ క్రీడకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.
హుజురాబాద్ లో గత 60 సంవత్సరాలుగా హాకీ కి హుజురాబాద్ పెట్టింది పేరు అని అన్నారు. ఎంతోమంది క్రీడాకారులు రాజకీయంగా, ఉద్యోగంలో ఈ హాకీ నుండి స్థిరపడిన వారు ఉన్నారని అన్నారు. రాబోయే తరాలకు కూడా హాకీని పరిచయం చేసి వారిని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు మేము కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భూసార శంకర్, వేముల రవికుమార్, ఆరెల్లి రమేష్, ఎండియూసుఫ్, సహాయకార్యదర్శి సాదులశ్యాం, సిహెచ్ రాజు, రాజేష్, కేరాజేష్, ఎస్ విక్రమ్, ఏం విక్రమ్, సాంబరాజు, పరబ్రహ్మంతో పాటు హాకీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.