28-04-2025 04:49:32 PM
రూ. 35 వేల పారితోషికం అందజేత..
బెల్లంపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభ గల 14 విద్యార్థులను ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సన్మానించీ, ప్రోత్సాహకoగా ప్రతి విద్యార్థికి రూ. 2500 పారితోషకాన్ని అందజేశారు. సోమవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రతిభ సాధించిన 14 మంది విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.2500 చొప్పున మొత్తం రూ.35 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతిభ గల విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.
సాధించిన ప్రతిభను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతమైన విద్యార్థులను ఆయన అభినందించారు. దివంగత పద్మారెడ్డి జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు కృష్ణారెడ్డి ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున 14 మందికి రూ. 35 వేలు ఎమ్మెల్యే వినోద్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.