calender_icon.png 12 March, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి టీచర్లకు సన్మానం

11-03-2025 10:18:59 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని సంఘం గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం, ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం వినూత్నంగా ప్రతి సంవత్సరం గర్భిణీ మహిళలకు సామూహిక 8సీమంతాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నసురుల్లాబాద్ మండల అంగన్వాడి సూపర్వైజర్ వాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ... ఒకనాడు వంటింటికి మాత్రమే పరిమితమైన పరిస్థితి నుండి నేటి సమాజంలో అన్ని రంగాల్లోకి ముందు వరుసలో ఉంటున్నారు. గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో సునీల్ రాథోడ్ మాట్లాడుతూ... మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు కావున మహిళలను సమానంగా గౌరవించుకోవడం మన ధర్మం అన్నారు. గర్భిణీ మహిళలకు సీమంతాలు నిర్వహించి గర్భిణీలకు పిల్లల పోషణను నిరంతరం పర్యవేక్షిస్తున్న అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ లను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. అనునిత్యం వారు పిల్లలు పోషణ గర్భిణీల పర్యవేక్షిస్తూ గ్రామ అభివృద్ధికి సేవలందిస్తున్న వారిని గుర్తించి గౌరవించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అంగన్వాడి టీచర్ లలిత, కవిత, జుబేదా, ఆశా వర్కర్ అక్షయ పాల్గొన్నారు.