04-03-2025 07:54:42 PM
కాటారం (విజయక్రాంతి): ఉత్తమ సేవలు అందించినందుకు గాను స్టాఫ్ నర్స్ ను ఎంపిక చేసి ఘనంగా సన్మానం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జన ఔషదీ వారోత్సవాలలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన కాటారం గిరిజన సంక్షేమ గురుకుల ఉన్నత పాఠశాల లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న అభినయ ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఆశా డే కార్యక్రమంలో అభినయను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ ఉమాదేవి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాటారం పి హెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ మౌనిక, డాక్టర్ హారిక, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్లు వందన, ప్రియాంక, గీత, తిరుపతి రెడ్డి, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.