01-04-2025 01:57:36 AM
సూర్యాపేట,మార్చి31(విజయక్రాంతి) : తెలంగాణ గ్రూప్1 ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే 290వ ర్యాంక్ సాధించిన జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర నరేష్ను సోమవారం అదే గ్రామానికి చెందిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఐపిఎస్ ఘణంగా సన్మానించారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఏలాంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలో గ్రూప్1 సాదించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు జాల శ్రవణ్, తేలు సైదులు, మాండ్ర రమేష్ , మాండ్ర సత్య గోవింద్ పాల్గొన్నారు.