31-03-2025 09:20:08 PM
పటాన్ చెరు: పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో అంజిరెడ్డిని ఈ సందర్భంగా సన్మానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర పార్టీ రాష్ట్ర నాయకులు అంజిరెడ్డిని సన్మానించారు.