అందోలు: ఆందోల్ జోగిపేట పురపాలికలో పాలక మండలి సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో జోగిపేటలోని మున్సిపల్ కార్యాలయంలో 20 మంది వార్డు కౌన్సిలర్లను నలుగురు నామినేటెడ్ కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్ తిరుపతి నేతృత్వంలోని అధికార బృందం ఘనంగా సన్మానించారు. మంగళవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో 2020, నుండి 2025 వరకు ఈ పాలకమండలి సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారని కమిషనర్ తిరుపతి సంతృప్తి వ్యక్తం చేశారు.