calender_icon.png 1 February, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నూతన కమిషనర్ కు సన్మానం

01-02-2025 05:39:14 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తుంగపిండి రాజలింగుని ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రధాన సమస్యలతో పాటు వికలాంగుల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యల మీద దృష్టి సారించి తగిన న్యాయం చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్, రామటెంకి దుర్గారాజ్, సాదుల విద్యాసాగర్, ఎర్రోజు రమేష్, జాగటి వెంకన్న, బై రాజు శ్రీనివాస్, దుర్గం సత్యం బాబులు పాల్గొన్నారు.