calender_icon.png 29 April, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్ కు సన్మానం

28-04-2025 10:34:36 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణాను మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సన్మానించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో త్రాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడగా, కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యేలకు విన్నవించుకోగా స్పందించిన ఎమ్మెల్యే, కమిషనర్లు వెంటనే బోర్లు వేయించి దాహార్తి తీర్చిన నేపథ్యంలో కమిషనర్ను కాలనీవాసులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఫణీంద్ర కుమార్ ,చాంద్, కలీం, ప్రభాకర్, అజీమ్, శ్రీనివాస్, వెంకటేష్, షకీల్, హైమద్, రాజు, ముసు, అఖిల్, మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్, జె భూమన్న తదితరులు ఉన్నారు.