25-04-2025 04:45:25 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మార్గం డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు భూసారపు గంగాధర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy)ని కలిసి సన్మానం చేశారు. ఎన్టీఆర్ మార్క్ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కాలనీ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యేకు సూచించగా ఆయన ఆ సమస్యల పరిష్కారానికి తక్షణం కృషి చేస్తారని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివరాం వెంకటేష్ పల్స గజ్జరం నరసయ్య రాజేశ్వర్ లింగం ప్రభాకర్ భూషణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.