10-04-2025 02:00:26 AM
తుంగతుర్తి ఏప్రిల్ 9: తుంగతుర్తి శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి నూతన ఆలయ చైర్మన్గా ఎనగందుల సంజీవ నియామకం జరిగింది ఆయన ఆధ్వర్యంలో తుంగతుర్తి లో శ్రీరామన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బుధవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సిరి ఫంక్షన్ హాల్ కు రాగ ఆలయ చైర్మన్ సంజీవ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే కూడా శాలువాతో ఆలయ చైర్మన్ ను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు