calender_icon.png 16 April, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఎస్పీకి సన్మానం

15-04-2025 01:42:31 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కొండగట్టు ఆలయ అధికారులు సోమవారం సన్మానించారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న  హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించబడిన సందర్భంగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిన జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతగా, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీకాంత్ రావు మాట్లాడుతూ.. జయంతి ఉత్సవాల రోజులలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భద్రతతో కూడిన శాంతియుత వాతావరణంలో దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్న పోలీస్ శాఖకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు హాజరయ్యారన్నారు.

ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన హనుమాన్ మాల విరమణ భక్తులకు, ప్రజలకు, పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సాయం చేసిన పోలీసు బృందాల సహకారం, క్షేత్రస్థాయిలో పనిచేసిన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది వల్లే ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అదే విధంగా భవిష్యత్తులో నిర్వహించబోయే పండుగలు, కార్యక్రమాల సందర్భాలలో కూడా పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లకు ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో  కొండగట్టు ఆలయ సూపరిండెంట్ సునీల్, మల్యాల సి.ఐ రవి, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్.ఐ నరేష్  పాల్గొన్నారు.